Flash News: మంత్రి విశ్వరూప్‌ కు అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు

0
112

ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం అంబేద్కర్‌ జిల్లా అమలాపురం పర్యటనలో ఉండగా.. విశ్వరూప్‌‌కు ఛాతీలో నొప్పి రావడంతో కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు మంత్రి విశ్వరూప్‌ను హుటాహుటిన రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు పేర్కొంటున్నారు.