ఏపీ లో త్వరలో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. దీంతో ఏపీలో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈరోజు కేబినెట్ జరిగిన అనంతరం..ఏపీ మంత్రులంతా రాజీనామా చేయనున్నారు. మొత్తం 25 మంది మంత్రుల నుండి ఏపీ సర్కార్ రాజీనామాలు తీసుకున్నట్టు సమాచారం. మంత్రి మండలి చివరి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో జరుగనుంది. అంతేకాకుండా ఏప్రిల్ 11 వ తేదీన కొత్త మంత్రి మండలి కూడా ఏర్పాటు కానుంది.