2019 ఎన్నికల్లో ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 22 స్థానాలను కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు ఈ 22 మంది ఎంపీల్లో ఎవరి ప్రత్యేకత వారిదే అయినా ఓ ఎంపీ మాత్రం చాలా ప్రత్యేకం… వైసీపీ ఎంపీల్లో ఆ ఎంపీ స్పెషల్….
ఆయన ఎవరో కాదు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి… వైసీపీలో ఎందరో యువ ఎంపీలు ఉన్నప్పటికీ మిథున్ రెడ్డికి పార్టీ పరంగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది… ఈయన ఎప్పుడూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు ఉంటూ వస్తున్నారు…
నిజానికి రెండోసారి మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత మీడియా ముందు పెద్దగా కలిపించలేదు… జిల్లాలో తన పని తాను చేసుకుంటూ పోయారు… తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రజల సమస్యలను పరిస్కరిస్తూ వారి మధ్యే ఉండేవారు… తాను అందుబాటులో ఉన్నా లేకున్నా ఫోన్ లో మాట్లాడి సమస్యకు పరిష్కారం చేస్తుంటారు…
అంతేకాదు లోక్ సభలో ఎన్నో సార్లు రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ప్రతీ సమస్యను ప్రస్తావించారు మిథున్ రెడ్డి… అందుకే జగన్ ఆయనకు అంత ప్రాధాన్యత ఇస్తారని అంటుంటారు… మిథున్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డికూడా చిత్తూరు జిల్లాలో తనదైన శైలిలో వ్యవహరిస్తుంటారు… పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవాను తగ్గించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసినప్పటి అది ఇప్పటివరకు సక్సెక్ కాలేదంటారు అక్కడి ప్రజలు