Breaking News- ఎమ్మెల్యే కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

MLA Quota Finalization of TRS MLC Candidates

0
76

తీవ్ర ఉత్కంఠకు తెర దించుతూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆఖరి నిమిషంలో ట్విస్టులు కనిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌ ప్రగతి భవన్‌ చేరుకున్నారు. ఆయనను మండలికి పంపించి..కేబినెట్‌లోకి తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఇప్పటి వరకూ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అనుకున్న ఓ ఎమ్మెల్సీ సీటు చేజారినట్లుగా ఉంది. అది కాస్త.. సిద్ధిపేట కలెక్టర్‌గా ఉండి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డికే ఇచ్చే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన జాబితాను చూస్తే గుత్తా సుఖేందర్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, తక్కెళ్లపళ్లి రవీందర్‌ రావు, కడియం శ్రీహరి కన్‌ఫాం అయ్యారు.

మరో రెండు స్థానాల్లో ఒకటి ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అనుకున్నా అది వెంకట్రామిరెడ్డికి ఇవ్వొచ్చంటున్నారు. మరో అభ్యర్థిగా బండా ప్రకాష్‌ పేరు తెరపైకి వచ్చింది. జాబితా ప్రకటించే ముందు వరకూ ప్రాబబుల్స్ లో ఉన్న టీఆర్ఎస్ దళిత నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు చివరికి నిరాశ ఎదురైంది. సోమవారం నాడే సిద్దిపేట్ కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డికి జాక్ పాట్ మాదిరిగా మంగళవారం నాడు ఎమ్మెల్సీ పదవి దక్కింది.

టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనలైజ్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా కొద్ది సేపటి కిందటే విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇవాళే ఆఖరు. ఇప్పటికే ప్రగతి భవన్‌ చేరుకున్న టీఆర్ఎస్ అభ్యర్థులు.. అక్కడి నుంచి నేరుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు.