కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే సీతక్క

Mla Seethakka in tears

0
117

ములుగు ఎమ్మెల్యే సీతక్క నిజమైన ప్రజానాయకురాలు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేనున్నాను అంటూ ముందుకొస్తారు. అధికార దర్పంతో నేడు రాజకీయ నేతలు కులుకుతుంటే… సీతక్క మాత్రం నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటారు. తాజగా ఒక విషయంలో సీతక్క కన్నీరు పెట్టుకున్నారు.

మావోయిస్టు నేత హరిభూషన్ కరోనా సోకి కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత సీతక్క హరిభూషన్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మహబూబాబాద్ జిల్లా, గంగారం మండలంలోని మడగూడెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. హరిభూషన్ కుటుంబసభ్యుల ఇల్లు మామూలు రేకుల ఇల్లు. అస్తర్ కార్ (ప్లాస్టింగ్) కూడా చేయకుండా ఉంది.

వారి ఇంటికి వెళ్లిన సమయంలో సీతక్క మాట్లాడుతూ హరిభూషన్ మరణించడం బాధాకరమైన విషయం అన్నారు. ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు. ఈ సమయంలో హరిభూషన్ కుటుంబసభ్యులు సీతక్క మీద పడి రోదించారు. దీంతో సీతక్క కూడా కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత వారిని ఓదార్చారు.

సీతక్క మావోయిస్టుగా ఉన్న సమయంలో హరిభూషన్ తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో హరి టీం లీడర్ గా ఉన్నప్పుడు తానూ ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమంలో పనిచేశానని గుర్తు చేసుకున్నారు సీతక్క.