రేవంత్ రెడ్డికి పిసిసి పదవి రాకతో నా మొక్కు తీరింది : సీతక్క

Mla Seethakka visited Madaram Sammakka Saralamma

0
121

శ్రీ మేడరాం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్నారు  కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క .ఈ రోజు తాడ్వాయి మండలం లోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ లను వన దేవతలను దర్శించుకున్న సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సోదరుడు మల్కాజి గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి ని నియమించడం సంతోషకరం అని ఆనందవ్యక్త పరిచారు.

గత మేడారం జాతరలో వన దేవత లను మొక్కిన మొక్కు తీరిందనారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి అని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకువచ్చే విధంగా మనమందరం కలిసి పని చేయాలని సీతక్క అన్నారు..