ఫ్లాష్- దోషిగా తేలిన ఎమ్మెల్యే..10 ఏళ్లు జైలు శిక్ష

0
79

ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు ప‌దేళ్ల జైలుశిక్ష పడింది. అక్రమ ఆయుధాల కేసులో పట్నాలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది. అనంత్ సింగ్ ఇంట్లో ఏకే-47 రైఫిల్ కలిగి ఉన్నారన్న కేసులో.. జూన్​ 14న దోషిగా తేల్చిన కోర్టు.. మంగళవారం శిక్షను ఖరారు చేసింది. అనంత్ సింగ్ ప్రస్తుతం పట్నాలోని బూర్ జైలులో ఉన్నారు.