‘లంచం- మంచం’ ప్రభుత్వం..ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

0
78

కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రియాంక్‌ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని ప్రకటించుకున్న బొమ్మై- పాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఖర్గే అన్నారు. ప్రభుత్వం అన్ని ఉద్యోగాలనూ తమకు ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని తాను ‘లంచం- మంచం’ ప్రభుత్వమని అనేందుకు సంకోచించనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు మగాళ్లు అయితే లంచం ఇవ్వాల్సి వస్తోందని, యువతుల అయితే మరో రకమైన ఒత్తిడి వస్తోందంటూ పేర్కొన్నారు.