ఎమ్మెల్సీ కవిత పరువునష్టం కేసు..వారికి కోర్టు నోటీసులు

0
85

భాజపా నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం కేసు వేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దన్న ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌కు కోర్టు ఆదేశించింది. అంతేకాదు వారికి సిటీ సివిల్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణ వచ్చే నెల13కు వాయిదా వేసింది.