ఎమ్మెల్సీ నారా లోకేశ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా

ఎమ్మెల్సీ నారా లోకేశ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా

0
101

నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, అలాగే మాజీ ఏపీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు..నారా లోకేశ్ 1983 జనవరి 23న పుట్టారు.. నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరిల ఏకైక కుమారుడు..చదువులో ఎప్పుడూ లోకేష్ ముందు ఉండేవారు.
ఆయన స్టాన్ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ చేశారు.. అలాగే కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజిమెంటు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీ చేసారు.

2017 మార్చి 30లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు, ఇక
రాష్ట్ర ఐటీ పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా కూడా చేశారు..తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో తెలియజేసిన నగదు బదిలీ పథకం ఆయన అభివృద్ధి చేశారు.2007 లో మామ నందమూరి బాలకృష్ణ కుమార్తె అయిన నందమూరి బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నారు.ఆయన ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్టు లోని హెల్త్ కేర్, విద్య యొక్క ట్రస్టీలలో ఒకరుగా ఉన్నారు.

నారా లోకేశ్ టీడీపీలో మే 2013లో చేరారు. తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించారు, అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కు మేనేజింగ్ డైరెక్టెర్ గా పనిచేశారు. తర్వాత ఆ బాధ్యతలు కుటుంబానికి అప్పగించి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

2019 శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గము నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, ఆయన పదవీ 2023 వరకూ ఉంది.