ఎమ్మెన్నార్ స‌క్సెస్ ‌- యువ‌త‌కు రోల్ మోడ‌ల్

ఎమ్మెన్నార్ స‌క్సెస్ ‌- యువ‌త‌కు రోల్ మోడ‌ల్

0
141

స‌క్సెస్ కి ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్ ..
నిరంత‌ర శ్ర‌మ‌జీవి,
నిత్య కృషీవ‌లుడు,
మంచితనానికి మారుపేరు- నిస్వార్ద‌ప‌రుడు
భార‌త్ గొప్ప‌త‌నాన్ని ద‌శ‌దిశ‌లా విస్త‌రించాల‌నుకునే వ్య‌క్తి
ఏదైనా సంక‌ల్పిస్తే అది ఆయ‌న నిర్వ‌ర్తించాల్సిందే
భార‌త ఆశాకిర‌ణం
యువ‌త‌కు రోల్ మోడ‌ల్
మోస్ట్ ప్రెస్టేజ‌స్ అవార్డులు ద‌క్కించుకున్నా, సాధార‌ణ వ్య‌క్తిగా క‌నిపించే సౌమ్యుడు
ఎమ్మన్నార్ గుప్తా

ప‌ర్సెన్ ఆఫ్ ది డికేడ్ 2020 అవార్డు సాధించారు గుప్త ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రు అనేది చూద్దాం..

ఎంద‌రో మ‌హానుభావులు జ‌న్మించిన ఆంధ్రప్ర‌దేశ్ లోని ..1976 లో ఆయ‌న తెనాలిలో పుట్టారు …ప్రేమ ఆప్యాయ‌త‌లు అనురాగాల పుట్టినిల్లు అయిన గోదావ‌రి జిల్లాలో ఆయ‌న పెరిగారు …..ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో ఆయ‌న చ‌దువుసాగింది. చ‌దువు అంటే చిన్న‌త‌నం నుంచి అమిత‌మైన ఇష్టం, దీంతో ఆయ‌న ట్రాన్స్ పొర్టేష‌న్ ఇంజ‌నీరింగ్ చేశారు, అలాగే ఎంటెక్ వ‌రంగ‌ల్ లో పూర్తి చేశారు, త‌ర్వాత పుణేలో ( Sibm లో) ఎంబీఏ పూర్తి చేశారు.

ప్రపంచ ప్రఖ్యాత ప్రపంచ మౌలిక సదుపాయాల నిపుణుడిగా ఆయ‌న‌కు పేరు వ‌చ్చింది, సోహర్ పోర్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఘ‌న‌త ఆయ‌న‌కే సొంతం. ఈ రంగంలో అనేక అవార్డులు అందుకున్నాడు. ఆయ‌న చేసిన కృషికి సుల్తనేట్ ఆఫ్ ఒమన్ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచంలో 8 వ ర్యాంక్ దేశంగా మారింది.

అంతేకాదు మెంట‌ర్ గా యూత్ ఐకాన్ గా, ఎంట్ర‌ప్రెన్యువ‌ర్ గా, మంచి వ‌క్త‌గా ఆయ‌న‌కు పేరు ఉంది, దేశంలోనే కాదు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఆయ‌న 82 అవార్డులు ఆయ‌న‌ని వ‌రించాయి..జీనియ‌స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయ‌న‌కు సాటిలేరు మ‌రెవ్వ‌రూ… ఆయ‌న ఈ అవార్డులు సాధించిన తొలి ఇంజనీర్, ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ రంగంలో ఆయ‌న‌కు ప‌ది అవార్డులు వ‌చ్చాయి, దేశంలో మోక్షగుండం విశ్వేశ్వ‌ర‌య్యగా ఆయ‌న పేరుగాంచారు.

ఐక్యూలో కూడా ఐకాన్ గా మారారు గుప్త‌, అమెరికా పీహెచ్ డీ స‌ర్టిఫైడ్ ఎమోష‌న్ ఐక్యూలో 124 స్కోరు, అలాగే నార్మ‌ల్ ఐక్యూ టెస్టులో122 స్కోర్ సాధించారు గుప్త‌… సుల్తనేట్ ఆఫ్ ఒమన్ లో గుప్తా పేరు తెలియ‌ని వారు ఉండ‌రు.. అనేక సంస్ధ‌లు చేప‌ట్టే ఇన్ ఫ్రాస్ట‌క్ర‌ర్ ప్రాజెక్టులు ఆయ‌న అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేస్తారు.

సుల్తనేట్ ఆఫ్ ఒమన్ – సౌదీలో జ‌రిగే ర‌హ‌దారి ప‌నుల్లో 80 శాతం ప‌నులు కేవ‌లం ఆయ‌న ఆరు నెల‌లో పూర్తిచేయించారు, ఒమ‌న్ సౌదీలో ఎన్నో ప్ర‌ఖ్యాత ప‌నుల‌ను పూర్తి చేశారు ఆయ‌న‌. ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుల‌ని పూర్తి చేసిన ఘ‌న‌త ఎమ్మెన్నార్ గుప్త‌కే సొంతం.

ఏకంగా ఒమన్ రాజు నుంచి అద్బుత నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు నిరూపించుకుని ఆయ‌న చేతుల మీదుగా ఇన్ ఫ్రా స్ట్రెక్చ‌ర్ ఎక్స్ లెన్స్ అవార్డు తీసుకున్నారు ఎమ్మెన్నార్ గుప్త‌…. రిట్జీ స్కూల్స్ సీఈవోగా ఆయ‌న కొన‌సాగుతున్నారు. (CEO of Ritzy group.)

2002 లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి విజన్ 2020 ఫ‌ర్ ట్రాన్స్ పొర్టేష‌న్ సెక్టార్ లో ప్ర‌తిపాద‌న‌లు ఇచ్చారు, ప్ర‌పంచంలో అమెరికా, దుబాయ్ , ఇండియా, ఒమ‌న్, కువైట్ ప‌లు యూర‌ప్ కంట్రీస్ నుంచి అవార్డులు అందుకున్నారు. గ‌డిచిన 15 ఏళ్ల‌ల్లో వంద‌ల స‌త్కారాలు అందుకున్నారాయ‌న‌.
అంతేకాదు ఆయ‌న (Person of the Decade) ప‌ర్స‌న్ ఆఫ్ ది డికేడ్ 2020కి కూడా అందుకున్నారు… అంతేకాదు మేటి నాయ‌కులు మేటి క్రీడాకారులతో పాటు Person of the year 2019 కుసెల‌క్ట్ అయ్యారుమంత్రి KTR, PV Sindhu లాంటి వారితో ఆయ‌న కూడా సెల‌క్ట్ అయ్యారు.

ఒక తెలుగువాడిగా ఈ అవార్డు దక్కించుకోవడం నిజంగా చాలా గ్రేట్ …ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలుగు మీడియంలో భీమ‌వ‌రంలో చ‌దువుచ‌దివి, ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ గ్లోబ‌ల్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్
మేనేజ్‌మెంట్ ఎక్స్‌ప‌ర్ట్‌గా తిరుగులేని టాలెంట్ చూపిస్తున్నారు గుప్త‌. ఆయ‌న సాధించింది ఎంతో ఉంది, అయినా ఇంకా చాలా ఉంది అంటారు, నిగ‌ర్విగా, మంచి మ‌న‌సున్న వ్య‌క్తిగా ఆయ‌న‌ని మ‌న ఎమ్మెన్నార్ అని పిలుస్తారు, యూత్ లో టాలెంట్ ని ఎంక‌రేజ్ చేస్తారు, విష‌యం ఉన్న వాడు ఎక్క‌డైనా నెగ్గుకు వ‌స్తాడు అనేది బాగా న‌మ్ముతారు, వైశ్య కులంలో పుట్టిన ఆయ‌న‌ని వైశ్య ర‌త్న‌గా పిలుస్తారు, ఎలాంటి కార్య‌క్ర‌మం జ‌రిగినా ఎమ్మెన్నార్ ముందు ఉంటారు, అందుకే యూత్ కి ఆయ‌న ఓ ఐకాన్ అయ్యారు.

అలాంటి వ్య‌క్తిని అభినందించాల్సిందే…

ఆయ‌న సాధించిన అవార్డులు కొన్ని చూద్దాం.