బ్రేకింగ్ మీ మొబైల్ లో ఈ ఏడు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి

బ్రేకింగ్ మీ మొబైల్ లో ఈ ఏడు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి

0
90

మొబైల్ కొనగానే మనం అనేక రకాల యాప్స్ వేస్తూ ఉంటాం, అయితే ఇందులో కొన్ని డేంజర్ యాప్స్ కూడాఉంటాయి, మన డేటా అంతా చోరి అయ్యే అవకాశాలు ఉన్నాయి వీటి వల్ల , అందుకే యాప్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి..గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి లక్షలాది యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు, కాని ఏది మంచిది అనేది తెలుసుకోవాలి.

యాప్ స్టోర్లో ఉండే నకిలీ యాప్స్తో తిప్పలు తప్పవు. ఈ యాప్స్ వల్ల మన కాంటాక్స్ ఫోటోలు బ్యాంకు డీ టెయిల్స్ ఇలా అన్నీ బయట వారికి తెలుస్తూ ఉంటాయి, సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. అలాంటి యాప్స్ని సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు ఎప్పటికప్పుడు గుర్తించి లిస్ట్ వెల్లడిస్తూ ఉంటాయి.

డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం అయిన అవాస్ట్ గేమర్స్ని టార్గెట్ చేస్తున్న యాప్స్ని గుర్తించి లిస్ట్ బయటపెట్టింది. ప్రతీ నెలా డబ్బులు గుంజుతున్న యాప్స్ గురించి బయటపెట్టారు. ఈ యాప్స్ ఏమిటి అంటే..

1. Skins, Mods, Maps for Minecraft PE2. Skins for Roblox
3. Live Wallpapers HD & 3D Background
4. MasterCraft for Minecraft
5. Master for Minecraft
6. Boys and Girls Skins
7. Maps Skins and Mods for Minecraft

ఈ యాప్స్ ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలి అని చెబుతోంది సంస్ధ.