రైతులకు మోడీ సర్కార్ గుడ్‌న్యూస్

0
93

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.  కాసేపటి క్రితమే కిసాన్ డ్రోన్లు ప్రారంభించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. రైతులకు మేలు జరిగేందుకు పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేసేందుకు కిసాన్ డ్రోన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

డ్రోన్ల వల్ల యువతకు కొత్త ఉపాధి, కొత్త అవకాశాలను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు ప్రధాని మోడీ. 21 శతాబ్ధపు ఆధునిక వ్యవసాయ సౌకర్యాల దిశలో డ్రోన్ వినియోగం కొత్త అధ్యాయం అన్నారు ప్రధాని మోడీ. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో పాటు టెక్నాలజీని వాడుకునేందుకు ఇప్పటికే బడ్జెట్ లో నిధులు కేటాయించిన కేంద్రం.. ఈ మేరకు కిసాన్ డ్రోన్లు ప్రారంభించింది.

భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో 100 కిసాన్ డ్రోన్లను వర్చువల్ గా ప్రారంభించారు పిఎం నరేంద్ర మోడీ. రాబోయే రెండేళ్లలో గరుడ ఏరోస్పెస్ కింద లక్ష మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటన చేశారు.