తీర్పు పై మోహన్‌ భగవత్ సంచలన కామెంట్లు

తీర్పు పై మోహన్‌ భగవత్ సంచలన కామెంట్లు

0
108

మొత్తానికి అయోధ్య తీర్పు వచ్చింది, దీనిపై బీజేపీ నేతలు కూడా దేశ ప్రజలకు కోర్టు తీర్పుని అందరూ గౌరవించాలి అని తెలియచేశారు.. అలాగే అందరూ ఫాలో అవుతున్నారు. రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు.

రామమందిరం నిర్మాణానికి.. అందరం చేయిచేయి కలిపి కర్తవ్యాన్ని నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ట్రస్ట్‌కు భూమి అప్పగించడం, ఆలయ నిర్మాణం అన్నీ జరుగుతాయన్నారు. ఇక్కడ రామమందిరం నిర్మిస్తామని తెలియచేశారు.

తమ పాత్ర రామ మందిర నిర్మాణంలో కచ్చితంగా ఉంటుంది అని ఆనందం వ్యక్తం చేశారు.ఫైనల్ గా సుప్రీం ఇచ్చిన తీర్పు ఇక అమలు అవుతుంది అని, అందరూ దీనికి కట్టుబడి ఉండాలి అన్నారు.. ఇక
గతాన్ని మర్చిపోదామని మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు. మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం ఎక్కడ ఇవ్వాలి, ఎలా అనేది.. సుప్రీం ఆదేశాల ప్రకారం కేంద్రం చూసుకుంటుందన్నారు. మా లక్ష్యం రామ మందిర నిర్మాణం. తామెప్పుడూ ఆందోళనలు చేయము అని పిలుపునిచ్చారు ఆయన..