ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..!

0
79

ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియటంతో ఇక, ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు – ఆ వెంటనే మంత్రివర్గ ప్రక్షాళన దిశగా సీఎం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్‌ 10 లేదా 11న ఏపీ కేబినెట్‌ విస్తరించడానికి విశాఖ శారదా పీఠాధిపతి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ముగ్గురు మినహా ప్రస్తుత మంత్రులందర్నీ తప్పించబోతున్నారు సీఎం జగన్‌. ప్రస్తుత మంత్రుల్ని పార్టీ పదవుల్లో నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ 2న ఉగాది నాడు ఏపీలో కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కానుంది.