తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో కీలక సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అయితే ఈ కీలక సమావేశంలో ఆర్థిక, శాసన సభ వ్యవహారాల మంత్రులు, ఫైనాన్స్ అధికారులు హాజరు అయ్యారు.
మార్చి 7వ తేదీన.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితమే ప్రగతి భవన్ అధికారులు ప్రకటన చేశారు.