ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియదు కాని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి, మన దేశం అనే కాదు దాదాపు ఇప్పటి వరకూ 30కి పైగా దేశాల్లో ప్రత్యక్షమయ్యాయి.. ఇప్పటిదాకా ఇలాంటి ఏకశిలలు తాము చూడలేదు అంటున్నారు కొందరు, మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షమైంది.
గత ఏడాది డిసెంబర్ లో అహ్మదాబాద్ పార్క్ లో స్టీల్ తో చేసిన ఓ ఏకశిల ప్రత్యక్షమైంది…మూడు అంచులుంది.. దానిని తామే ఏర్పాటు చేయించామంటూ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇప్పుడు ముంబైలో మళ్లీ ఇలాంటిది కనిపించింది.ఏకశిల ముంబై పార్కులో దర్శనమిచ్చింది. బాంద్రాలోని జాగర్స్ పార్క్ లో వెలిసింది. దానిపైన కొన్ని అంకెలు కూడా ఉన్నాయి.
బృహన్ ముంబై కార్పొరేషన్ స్పందించలేదు. మరి దీనిని ఎవరు ఏర్పాటు చేశారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది..అమెరికాలోని యూటాలో ఉన్న ఎడారి ప్రాంతంలో కనిపించింది ఇది…తర్వాత మళ్లీ కనిపించలేదు, సో చూడాలి అసలు ఇది ఏమిటి అనేది.