ముదురుతున్న కడప జిల్లా రాజకీయం….

ముదురుతున్న కడప జిల్లా రాజకీయం....

0
78

కడప జిల్లాలో రాజకీయాలు ముదురుతున్నాయి… తాజాగా జిల్లాకు చెందిన కమలాపురం నియోజకవర్గం టీడీపీ యువనాయకుడు పుత్తా లక్ష్మిరెడ్డి వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు… అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తనపై తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు… పుత్తా నరసింహా రెడ్డి అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అసత్య ప్రచారం చేయడం తగదని అన్నారు…

అయినా మా కుటుంబం గురించి మాట్లాడే స్థాయి వారికి లేదని ఆరోపించారు.. గత టీడీపీ హయాంలో ఉచితగా ఇసుక పాలసీ ఎంతో పారదర్శకంగా జరిగిందని తద్వారా తక్కువ ధరకే ప్రజలందరికీ ఇసుక అందుబాటులో ఉండేదని అన్నారు..

ప్రస్తుత ప్రభుత్వం హయంలో ఇసుక పాలసీ అనేది ఎలాంటి దో ఎవరికీ తెలియలేదని అన్నారు… ఇష్టారాజ్యంగా జీవోలు తెస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు… తాను తన కుటుంబం కానీ అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు ఆయన…