తమిళనాడులో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి, ఈసారి అన్నా డీఎంకే, డీఎంకే అలాగే కాంగ్రెస్ బీజేపీతో పాటు కమల్ కూడా తన పార్టీతో ప్రజల్లోకి వస్తున్నారు,
మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల హాసన్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు, ఇక
తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్దుల ఎంపిక కూడా చేస్తున్నారట.
గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు పార్టీ తరపున, ఇక తాజాగా కీలక ప్రకటన వచ్చింది..తమ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటోన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, వారు రూ.25 వేలు చెల్లించాలని తెలిపారు, మొత్తానికి ఎవరైనా ఇందులో ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక మేలో తమిళనాడులో ఎన్నికలు జరుగనున్నాయి, ఇక ఐదు రాజకీయ పార్టీలు నువ్వా నేనా
అనే రేంజ్ తో తలపడనున్నాయి, మక్కల్ నీది మయ్యం బ్యాటరీ టార్చ్ సింబల్‌తో పోటీ చేయనుంది
.తమిళనాడులోని 234 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి, ఇక ఆయన పార్టీ తరపున అన్నీ వర్గాల వారికి టిక్కెట్లు ఇవ్వాలి అని చూస్తున్నారు. ఆశావాహులు చాలా మంది ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకుంటున్నారు.