మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు తెలంగాణ సిద్దం అవుతోంది, కచ్చితంగా మెజార్టీ సీట్లు కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తాం అంటున్నారు టీఆర్ ఎస్ నేతలు, కమిటీల ఏర్పాటు ఇంచార్జీల ఏర్పాటులో బిజీగా ఉన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్.
ఇక ఈ ఎన్నికల బాధ్యతలు అన్నీ ఆయనే చూస్తున్నారు అని తెలుస్తోంది, తాజాగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గెలుపు కారు పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని దమ్మాయిగూడలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని, మున్సిపల్ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని చెప్పారు. ఇక ఆ శాఖపై పట్టు ఉన్న నేతగా కేటీఆర్ ఉన్నారు గెలుపు బాధ్యత ఆయన చేతుల్లోనే ఉంది అంటున్నారు నేతలు.