బీహెచ్ సిరీస్ దేశంలో ఇప్పుడు దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది చాలా మంది ఉద్యోగులకి ఎంతో బెనిఫిట్ అవుతుంది. అసలు ఇది ఏమిటి అంటే ? వాహనదారులు రాష్ట్రాలు మారినప్పుడు వాటి రిజిస్ట్రేషన్ మార్పిడిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కేంద్రం వీటికి స్వస్తి పలికేందుకు ఈ విధానం తీసుకువచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి దేశంలో ఈ విధానం అమలు చేస్తారు.
ఉద్యోగ రీత్యా తరచూ వివిధ రాష్ట్రాలకు బదిలీ మీద వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వారి వాహనం రిజిస్ట్రేషన్ విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. తరచూ మార్చుకోవాల్సి వస్తోంది, అందుకే కేంద్రం ఈ కొత్త విధానం తీసుకువచ్చింది.
ఇక బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను ఉద్యోగులు ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికైనా ఇబ్బందుల్లేకుండా తీసుకుపోవచ్చు.
ఇక మీరు కొత్తగా ఏ స్టేట్ కు వెళ్లినా అక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఇది ఎవరు కోరితే వారికి మాత్రమే చేస్తారు. ఈ సిరీస్తో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు సంవత్సరం-బీహెచ్-నాలుగు నంబర్లు-రెండు ఇంగ్లిష్ అక్షరాలతో నంబర్ కేటాయిస్తారు. స్వచ్ఛందంగా ఎవరు అడుగుతారో వారికి మాత్రమే ఇలా రిజిస్ట్రేషన్ ఉంటుంది.
మీరు ప్రైవేటు రంగంలో పని చేసే వారైతే ఫామ్ 60 కింద వర్కింగ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రభుత్వ గుర్తింపుకార్డు రిజిస్ట్రేషన్ సమయంలో చూపించాలి.