ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

MP Komatireddy sensational remarks

0
105
komatireddy venkat reddy

హుజురాబాద్‌ ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. ఘోర పరాభవంపై నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఉప ఎన్నిక ఓటమిపై అంతర్మథనానికి బదులు అంతర్యుద్ధమే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. చివరికి ఓటమికి కారణాలను తేల్చేందుకు ఓ కమిటీని వేయాలని డిసైడ్ అయినా.. సీనియర్ నేతలు పీసీసీ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మరోమారు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ విమర్శలు పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ అంటే రేవంత్‌ ఒక్కడే కాదని వందేళ్ల చరిత్ర ఉందన్నారు. పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యాక తననను ఎప్పుడు ఏ మీటింగ్‌కి పిలవలేదని మండిపడ్డారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 13 నెంబర్‌గా పెట్టడంపై కోమటిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న తమను డమ్మీలను చేయాలని చూస్తున్నారన్నారు.

హుజురాబాద్ నా అవసరం లేదనుకునే క్రికెట్ చూడడానికి వెళ్లాను 33 సంవత్సరాల కాంగ్రెస్ కెరీర్‌లో హుజురాబాద్‌ ఎన్నిక షాక్ కి గురి చేసిందన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సిరియస్‌గా తీసుకోలేదని ఆరోపించిన కోమటిరెడ్డి..ఒక్కసారి అయిన అక్కడ సభ పెట్టారా? అని ప్రశ్నించారు.