ఆ విషయం పట్టించుకోవద్దు : స్పీకర్ కు రఘురామ లేఖ

0
123

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసిపి రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. తనపై అనర్హత వేటు వేయాలని తమ పార్టీ ఎంపీ విజయసారిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును చెత్తబుట్టలో పడేయాలని ఆ లేఖలో కోరారు.

పార్టీ క్రమశిక్షణను ఎక్కడా తాను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్దుకోవాలని హితవు చెప్పడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు రాదని స్పీకర్ కు రాసిన లేఖలో సూచించారు.

భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అసమ్మతి కిందకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ లేఖతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల కాపీలను కూడా జత చేశారు. తన ప్రవర్తన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు రాదని తేల్చి చెప్పారు. తాను ఏనాడూ పార్టీ విప్ ను ధిక్కరించలేదని వెల్లడించారు.