వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు జగన్ తర్వాత ఆయనే అని అందరూ నమ్మే వ్యక్తి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, అయితే హస్తినలో పార్టికి సంబంధించిన రాజకీయాలు అన్నీ ఆయనే చూస్తారు
సీఎం జగన్ కూడా ఆయనకు అంతే ప్రయారిటీ ఇస్తారు.
తాజాగా వైసీపీ బలం రాజ్యసభలో పెరిగింది,దీంతో రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. ఈ నేపథ్యంలో కీలకమైన రాజ్యసభ బీఏసీలో వైసీపీకి చోటు దక్కింది. దీంతో, బీఏసీలో సభ్యుడిగా విజయసాయి రెడ్డికి స్థానం లభించింది.
ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ బలం రెండు నుంచి ఆరుకు పెరిగింది. పార్టీ రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వానీలు ఉన్నారు. ఇక పదవి రావడంతో ఆయనకి అందరూ విషెస్ చెబుతున్నారు.