ముద్రగడ మౌనం వెనుక రహస్యం…?

ముద్రగడ మౌనం వెనుక రహస్యం...?

0
110

కోస్తాలో కాపు సామాజిక వర్గానికి కులదైవంగా ఎదిగిన మాజీ మంత్రి కాపు ఉద్యమనేత మద్రగడ పద్మనాభం కొద్దికాలంగా సైలెంట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి… టీడీపీ సర్కార్ అధికారంలో ఉండగా కాపు రిజర్వేషన్ల కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు ముద్రగడ… ఆయన ఉద్యమాలకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉల్టా పల్టా అయ్యారు…

ఈ దశలో కేంద్రం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లతో కొంత కాపులకు కేటాయిస్తున్నట్లు ఎన్నికల ముందు ప్రకటించి ఈ వివాదానికి తాత్కాలిక ముగింపు ఇచ్చి రాజకీయానికి తెరతీశారు… దీనిపై ముద్రగడ పద్మనాభం పలు ప్రశ్నలు సంధించినా వాటికి పొలిటికల్ జవాబులు వచ్చాయి తప్ప మరోకటి లేకుండా పోయింది… సీన్ కట్ చేస్తే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది…

ఎన్నికల ముందు హడావిడిగా ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు కాపులను ఇచ్చిన ఉత్తర్వులను కొట్టిపారేశారు.. తమ మ్యానిఫెస్టో లో ప్రకటించిన విధంగా కాపు కార్పోరేషన్ కి వరాలు ప్రకటించింది… కాపు రిజర్వేషన్ అంశం తమ పరిధిలోనిది కాదని అది కేంద్ర పరిధిలోనిది కనుక తాము చేసేది ఏమీ లేదంటూ తేల్చిసింది… ఇదే అంశం ఎన్నికల ముందు కూడా వైఎస్ జగన్ చెప్పడంతో అధికారంలోకి వచ్చాక చెప్పిందే చేయడంతో కాపు రిజర్వేషన్ల అంశం అటకెక్కింది…

ఈ నేపథ్యంలో మరోసారి ముద్రగడ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడతారని ఆ సామాజిక వర్గం భావించింది… కానీ ఆయన ఎలాంటి ఉద్యమాలు చేయలేదు… పలు సందర్భల్లో ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు కానీ సీరియస్ గా తన అజెండా పై పోరాట వైఖరిని ఆయన అభుసరించకపోవడం చర్చనీయంశం అయింది…