మూడు రాజధానులపై హైకోర్టు ఫుల్ క్లారిటీ…

మూడు రాజధానులపై హైకోర్టు ఫుల్ క్లారిటీ...

0
89

మూడు రాజధానులపై హైకోర్టు స్పందించింది…. రాష్ట్ర రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు రానప్పుడు తామెలా జోక్యం చేసుకోగలమని తెలిపింది… అంత హడావుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది..

తాజాగా సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి న్యాయమూర్తి జస్టిస్ మంథాట సీతారామమూర్తి నేతృత్వంలో ధర్మాసనం ముందు ప్రస్తావించారు… దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఇప్పటివరకుప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రానప్పుడు తామెలా స్పందిస్తామని తెలిపింది..

తరలింపు అనేది ఒక్క రోజులో పూర్తి అయ్యే ప్రక్రియ కాదని తెలిపింది.. అందువల్ల అత్యవసర విచారణ జరగాల్సిన అవసరం లేదని చెప్పింది.. ఒకవేళ అవసరం అనుకుంటే సంక్రాంతి తర్వాత పిటీషన్ ధాఖలు చేసుకోవాలని ధర్మాసనం తెలిపింది…