ముఖేష్ అంబానీని చదువు మధ్యలో ఆపించి తండ్రి ఏం చేశాడో తెలుసా ?

ముఖేష్ అంబానీని చదువు మధ్యలో ఆపించి తండ్రి ఏం చేశాడో తెలుసా ?

0
90

ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలో అపర కుబేరుడు, అయితే ఎన్నో కష్టాలు నష్టాలు చూసి ధీరూబాయ్ అంబానీ ఈ స్టేజ్ కు వచ్చారు, తర్వాత కుమారుడు ముఖేష్ కూడా తండ్రి పేరు నిలబెడుతూ రిలయన్స్ ని అగ్రస్ధానంలో నిలబెట్టారు, అయితే ఆయన వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఎలా ఇచ్చారో తెలుసా..

1980 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం పాలిస్టర్ ఫిలమెంట్ యార్న్ ను ప్రారంభించింది. దీనిని ప్రయివేటు రంగానికి అప్పగిస్తూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఉత్తర్వులిచ్చింది. వెంటనే చాలా కంపెనీలు పోటీ పడ్డాయి,

అందులో ధీరూభాయ్ అంబానీ టాటా, బిర్లా, మరో 43మంది వ్యాపారులు పోటీ పడ్డారు, అందరూ ధరఖాస్తు చేసుకున్నారు. అదృష్టం ధీరూబాయ్ కు లైసెన్స్ వచ్చింది..ఈ కొత్త వ్యాపారాన్ని నడిపేందుకు ధీరూభాయ్ తన పెద్ద కుమారుడు ముఖేష్ ను స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చదువు మధ్యలో ఆపి తీసుకువచ్చారు.

అలా ముఖేష్ తన చదువును మధ్యలో ఆపేసి ఇలా వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు..అలా ఆ బిజినెస్ తో 1981లో ముఖేష్ వ్యాపార ప్రస్థానం మొదలైంది. తర్వాత ముఖేష్ రిలయన్స్ ఇన్ఫోకాం లిమిటెడ్ స్టార్ట్ చేశారు.