ధీరూభాయ్ అంబానీ కుమారుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలో టాప్ 10 ధనవంతుల్లో ఒకరు, ఇక భారత్ లో ఆయన కుబేరుడు అనే చెప్పాలి, ఆయనకు దగ్గర్లో కూడా ఆ రికార్డ్ బీట్ చేసే వ్యాపారులు ఇప్పుడు లేరు, అయితే తన తండ్రిని నిత్యం ఆయన ఏ పని చేసినా తలుచుకుంటారు, తన తండ్రి చూపిన మార్గమే మాకు ఈ పేరు ప్రతిష్ట వచ్చింది అని నమ్ముతారు.
టైమ్ ని బాగా నమ్ముతారు కష్టాన్ని నమ్ముకున్నారు, అందుకే ఈ రోజు రిలయన్స్ ఆ రేంజ్ కు వెళ్లింది, గతంతో తన తండ్రి అడిగిన ఓ ప్రశ్న గురించి ఇప్పుడు మాట్లాడారు ఆయన.
ఒకనాడు..తన తండ్రి ధీరూభాయ్ అంబానీ అడిగిన ప్రశ్నకు సమాధానమే నేటి జియో విప్లవమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ఎన్కే సింగ్ రచించిన పోట్రేయిట్స్ ఆఫ్ పవర్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ మాట అన్నారు ఆయన.
పోస్ట్ కార్డుకు అయ్యేంత ఖర్చుతో ఇండియాలోని ప్రజలంతా ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం వస్తుందా? అని తన తండ్రి తనను ప్రశ్నించారని, దానికి సమాధానాన్ని తాను ఇప్పుడు చెప్పగలనని అన్నారు. జియోతో టెలికం విప్లవం మరో మెట్టు ఎక్కిందని చెప్పారు. ఇప్పుడు అది నిజం అయింది అని గుర్తు చేశారు ఆయన, ఇండియాలో తయారీ రంగానికి మరిత ప్రోత్సాహం ఇవ్వాలి అని ఆయన కోరుతున్నారు.