ఐసియులో ఎమ్మెల్యే సీతక్క తల్లి, సీతక్కకు ఘోర అవమానం : డోంట్ టాక్ రబ్బిష్

0
140

తెలంగాణలో ప్రజల నాయకురాలుగా గుర్తింపు పొందిన వ్యక్తి ములుగు ఎమ్మెల్యే సీీతక్క. హైదరాబాద్ పోలీసులు ఆమెను అవమానపరిచారు. పూర్తి వివరాలు ఇవీ.

సీతక్క తల్లికి సీరియస్ గా ఉంటే హైదరాబాద్ లో ఆసుపత్రిలో ఐసియు లో చేర్పించారు. ఆమెకు రక్తదానం చేసేందుకు ములుగు నుంచి సీతక్క కుటుంబసభ్యులు కొందరు పర్మిషన్ తో హైదరాబాద్ వస్తుండగా మల్కాజ్ గిరి డిసిపి రక్షిత మూర్తి అడ్డుకున్నారు. అంతేకాకుండా వారితో దురుసుగా మాట్లాడారు. అరగంట సేపు పక్కన నిలబెట్టారు. సీతక్క స్వయంగా వీడియో కాల్ మాట్లాడే ప్రయత్నం చేయగా ఆ వీడియో కాల్ మాట్లాడకుండా రక్షిత మూర్తి సదరు సీతక్క కుటుంబసభ్యులను డోంట్ టాక్ రబ్బిష్ అంటూ దుర్భాషలాడారు.

ఒక జాతీయ పార్టీలో ఎమ్మెల్యే అయిన తనకే ఈ దుస్థితి ఉంటే సామాన్య మానవులకు తెలంగాణలో పోలీసులు ఏం న్యాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సీతక్క బాధపడుతూ చెప్పారు. సీతక్క వీడియో కాల్  వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు.

 

https://www.facebook.com/watch/?v=483189352959635