Breaking News- ములుగు ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం

0
38

తెలంగాణ: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు  ముంపుకు గురయ్యాయి. దీనితో ఎమ్మెల్యే సీతక్క  ఈరోజు వారికి సరుకులు పంపిణీ చేసేందుకు వెళ్లే క్రమంలో వాగు దాటాల్సి వచ్చింది. దీనితో ఆమె పడవ ఎక్కారు. సరుకులు అందజేసి వస్తుండగా తిరుగు ప్రయాణంలో ఆమె ప్రయాణిస్తున్న పడవ చెట్టును ఢీకొట్టింది. దీనితో అధికారులు వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. చివరకు ఎమ్మెల్యే సీతక్కను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.