మున్సిపల్‌ కమిషనర్‌ అత్యుత్సాహం..మంత్రి కేటీఆర్ సీరియస్

0
95
KTR

తెలంగాణ: టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఈ నెల 24వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిసారి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటారు. ఈసారి రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆయన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనలేదని సిబ్బందికి మెమో జారీ చేయడంపై కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. మున్సిపల్‌ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు.

ఈ మేరకు పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అభిమానాన్ని ప్రోత్సహించడంలో తానెప్పుడు చివర ఉంటానని కేటీఆర్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన ట్విట్టర్ లో కూడా పోస్ట్ పెట్టారు.

https://twitter.com/KTRTRS