బాబు ఊరిలో వైసీపీ నేత హత్యకు 10 లక్షల సుపారి

బాబు ఊరిలో వైసీపీ నేత హత్యకు 10 లక్షల సుపారి

0
94

చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుడి హత్యకు కుట్ర పన్నారు అనే వార్త ఇప్పుడు పెద్ద షాక్ కి గురి చేసింది.. పైగా మాజీ సీఎం చంద్రబాబు సెగ్మెంట్ కుప్పంలో ఈ వార్త వినిపిస్తోంది, అంతేకాదు పది లక్షల రూపాయలకు సుపారీ కూడా తీసుకున్నారట.
.
చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన వైఎస్సార్సీపీ నేత హత్యకు కుట్ర జరిగింది. పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్ కు రూ.10లక్షలు సుపారీ ఇచ్చి విద్యాసాగర్ అనే వైసీపీ కీలక నాయకుడిని హత్య చేయించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే కొంత మేర అడ్వాన్స్ కూడా ఇచ్చారట.

ఒక మధ్య వర్తి ద్వారా ఈ వార్త తెలుసుకున్న విద్యాసాగర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు… ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఎన్నికల ముందు విద్యాసాగర్ టీడీపీలో ఉన్నారు, ఆ సమయంలో ఆయన వైసీపీలో చేరి వైసీపీ గెలుపుకి సాయం చేశారు.

ఎన్నికలకు రెండు నెలల ముందు వైఎస్సార్సీపీ అభ్యర్థి చంద్రమౌళి అనారోగ్యం పాలై ఆసుపత్రిలోనే చేరడంతో.. ఆయన కుమారుడు భరత్ కు చేదోడుగా ఉంటూ పార్టీ శ్రేణులకు విద్యాసాగర్ భరోసా ఇచ్చారు.. అయినా అక్కడ వైసీపీ ఓటమి పాలైంది,
ఈ సమయంలో మరి సాగర్ ని ఎవరు చంపాలని ప్రయత్నం చేశారు అనే దానిపై కుప్పం ప్రజలు చర్చించుకుంటున్నారు.