గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు

గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు

0
249

హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నానుడిని ముస్లిం సోదరుడు నిరూపించాడు. అందుకు వినాయక చవితి వేడుకలు వేదికగా మారాయి. మునుగు జిల్లా ఏటూరు నాగారం లో వినాయక నిమజ్జనోత్సవం లో భాగంగా నిర్వహించిన లడ్డు వేలం పాటలో ఓ ముస్లిం యువకు డు పాల్గొన్నా డు.

గ్రామంలోని బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద నిర్వహించిన వేలంపాటలో ఎండి అబ్దుల్ భాష పాల్గొన్నాడు. ఒకటి కాదు రెండు లడ్డు లను సొంతం చేసుకున్నాడు. రూపాయలు 20,516 కు ఒక లడ్డూను, రూపాయలు 8,716 కు మరొక లడ్డూను దక్కించుకున్నారు లడ్డూను దక్కించుకున్నారు.

అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి, గణనాధుని ఆశీస్సులు తీసుకున్నాడు. లడ్డూలు కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని అబ్దుల్ భాషా చెప్పాడు. గణపతి లడ్డూను సొంతం చేసుకొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాడు అబ్దుల్ భా షా.