మీరు ఫోర్ వీలర్ వాడుతున్నారా అయితే కచ్చితంగా మీకు ఫాస్టాగ్ ఉండాల్సిందే, దేశంలో ప్రతీ ఒక్క ఫోర్ వీలర్ వాహనానికి ఫాస్టాగ్ తీసుకోవాలి అని తెలియచేసింది కేంద్రం… ఇక టోల్ ప్లాజా నుంచి వెళ్లే వాహనాలు కచ్చితంగా ఈ టోల్ ని కట్టే సమయంలో ఫాస్టాగ్ ని వాడాల్సిందే.
అందరూ గుర్తు ఉంచుకోండి, ఫాస్టాగ్కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు… సో ఇక డేట్ పొడిగింపు ఉండదు..గడువు ఫిబ్రవరి 15తో ముగుస్తుంది. ఇప్పటి వరకూ ఫాస్టాగ్ లేని వెహికల్స్ కు ఓ లైన్ ఇచ్చారు ఇక ఆ దారి మూసేస్తారు అన్నీంటికి ఫాస్టాగ్ ఉండాల్సిందే ఫ్రిబ్రవరి 16 నుంచి.
ఒకవేళ మీ వెహికల్ కి ఫాస్టాగ్ లేకపోతే మీకు 50 రూపాయల టోల్ అయితే మీరు మరో 50 అదనంగా చెల్లించాలి అంటే 100 చెల్లించాలి, సో ఇది ఫైన్ లా పడుతుంది …అందుకే ప్రతీ 4 వీలర్ వాహనదారుడు ఇలా ఫాస్టాగ్ తీసుకోవాలి అని చెబుతున్నారు.
మీరు ఆన్ లైన్ లో లేదా టోల్ ప్లాజాల దగ్గర బ్యాంకుల దగ్గర ఫాస్టాగ్ కొనుక్కోవచ్చు.