సంక్రాంతి మన దేశంలో పెద్ద పండుగగా జరుపుకుంటారు.. రైతులకి కొత్త పంటలు చేతికి అందుతాయి.. కొత్త అల్లుళ్ల సందడి ఉంటుంది.. ఇక భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ నాలుగు రోజులు పండుగ జరుపుకుంటారు.. ముఖ్యంగా మన సృష్టికి మూల ఆధారం ఆ సూర్యుడు… ఆయన లేకపోతే పంటలు పండవు.. మరి పాడి పంటలకు ఆయనే మూలాదారం.. మరి సంక్రాంతికి కచ్చితంగా సూర్యభగవానుడ్ని పూజించాలి..
ఈ సంవత్సరం జనవరి 13న భోగి పండుగ వస్తోంది. మర్నాడు సంక్రాంతి.
జనవరి 14న మకర సంక్రాంతి
జనవరి 15 కనుమ
జనవరి 16 న ముక్కనుమ జరుపుకుంటాం
అయితే మరి పుణ్య కాలం ఎప్పడు అనేది చూద్దాం, సంక్రాంతి జనవరి 14న ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.54 గంటల వరకూ మకర సంక్రాంతి పుణ్య కాలం ఉంది. అలాగే మకర సంక్రాంతి మహా పుణ్యకాలం
జనవరి 14న ఉదయం 8.30 గంటల నుంచి ఉదయం 10.22 గంటల వరకూ మకర సంక్రాంతి మహా పుణ్య కాలం ఉంది. ఈ సమయంలో కొత్త పనులు ఏమి చేసినా సూపర్ సక్సెస్ అవుతాయి.