నా ఓటమికి అదే కారణం టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్

నా ఓటమికి అదే కారణం టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్

0
87

కారు పార్టీ గళం వినిపించిన నేతల్లో కీలక నేతగా ఉద్యమం నుంచి ఉన్న నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు కరీంనగర్ టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ .. కాని ఆయన గత లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు, ఆయన ఓటమితో అందరూ షాక్ అయ్యారు, అయితే తాజాగా తన ఓటమికి కారణం కూడా ఆయన చెప్పారు.

అతి ధీమాతో ప్రచారం చేయకపోవడం వల్లే తాను ఓడిపోయానని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గెలుపోటములు తనకు సమానమే అని… ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలేదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ పార్టీ పుట్టిన సమయంలో తామేమీ పదవుల కోసం చూడలేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవుతాము అని అనుకోలేదు అని తెలియచేశారు.

కేసీఆర్ కూడా సీఎం అవుతారని అనుకోలేదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చాలా మంది టికెట్లు ఆశిస్తున్నారు సరైన నేతలకు టికెట్లు ఇస్తాం అని తెలిపారు, బీజేపీ మత రాజకీయాలు ఆపాలి అని కోరారు.