నడ్డా ఏ లడ్డు ఇచ్చారో కానీ… కాషాయం వైపు తిరిగిన పవనాలు

నడ్డా ఏ లడ్డు ఇచ్చారో కానీ... కాషాయం వైపు తిరిగిన పవనాలు

0
94

ఈ రోజు ఉదయం 11నుంచి బీజేపీ జనసేనలు సమావేశం అయ్యాయి… ఈ సమావేశం మూడు గంటలపాటు నిర్వహించారు… ఇక నుంచి ఏపీ రాజకీయాలలో తాము బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు…

సమావేశం తర్వాత పవన్ ప్రెస్ మీట్ నిర్వహించారు… ఈ ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ… ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని తెలిపారు… కేంద్రంలో బలమైన పార్టీవల్ల ఏపీకి లాభం ఉంటుందని తెలిపారు.. ఇక నుంచి తాము అధికారమే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతామని అన్నారు పవన్…

అందుకే తాము అంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని అన్నారు.. ప్రజా సమస్యలపై కలిసి పోరాడతామని తెలిపారు.. బీజేపీ జనసేనలో భావజాలం ఒక్కటే అని తెలిపారు..