నాదేండ్ల కూడా జనసేనకు బైబై… త్వరలో వైసీపీలోకి జంప్ నిజమేనా

నాదేండ్ల కూడా జనసేనకు బైబై... త్వరలో వైసీపీలోకి జంప్ నిజమేనా

0
88

త్వరలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో… జనసేన పార్టీలో పవన్ అందుబాటులో లేనప్పుడు మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ అన్నీ చూసుకునే వారు… పవన్ ఎక్కడకు వెళ్తే అక్కడ నాదేండ్ల మనోహర్ ఉండేవారు..

అయితే ఈ మధ్య కాలంలో పవన్ పక్కన ఆయక కనిపించకున్నారు… ఇటీవలే పవన్ అమరావతి పర్యటనకు నాదేండ్ల హాజరు కాలేదు… ఆయన అనారోగ్య కారణాల వల్ల ఈ పర్యటనకు హాజరు కాలేదని చెబుతున్నారు… కానీ అసలు రీజన్ అది కాదని అంటున్నారు విశ్లేషకులు… పవన్ వ్యవహార శైలి పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి…

గతంలో తాను ఇక నుంచి రాజకీయాల్లో ఉంటానని చెప్పిన పవన్ తిరిగి సినిమాలు చేస్తున్నారు… దీనివల్ల పార్టీ కేడర్ లో తప్పుడు సంకేతాలు వెళ్లడమే కాకుండా పార్ట్ టైపాలిటిక్స్ అని విమర్శలు వస్తాయని భావించి నాదేండ్ల తన రాజకీయ దృష్ట్య జనసేనకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది… ప్రస్తుతం ఆయన వైసీపీలోకి కానీ బీజేపీలోకి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…