నాగబాబు గురించి సీక్రెట్స్ చెప్పిన పవన్ కల్యాణ్

నాగబాబు గురించి సీక్రెట్స్ చెప్పిన పవన్ కల్యాణ్

0
89

పవన్ కల్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్నారు.. ఇక సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అవుతున్నాడు. పింక్ చిత్రానికి సంబంధించి వర్క్ కూడా జరుగుతోంది ..ఈ సమయంలో తాజాగా తన అన్నయ్య మెగా బ్రదర్ నాగబాబు కూడా ఆయనకు రాజకీయంగా జనసేనలో కొనసాగుతున్నారు. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

తాజాగా నాగబాబు గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కొన్ని విషయాలు తెలియచేశారు. చిన్న అన్నయ్య నాగబాబు ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి అని, ఆయనలో బయటకి తెలియని చాలా కోణాలు ఉన్నాయని దానితో పాటు మంచి చిత్రకారుడు, వేణువు విద్వాంసుడు, యోగాబ్యాసం లాంటి చాలా విషయాలు ఆయనతో ఇమిడి ఉన్నాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు విషయాల గురించి చాలా అవగాహన ఉంది అని చెప్పారు పవన్ కల్యాణ్.

అంతేకాకుండా నాగబాబుకి ప్రముఖ న్యాయ నిపుణుడు ఫాల్కీవాలా రచనలు, వీర సావర్కర్, భగత్ సింగ్ అంటే ఇష్టమన్నారు. దానితో పాటె ప్రజలందరికి తెలియని సరికొత్త కోణమైన దర్శకుడు నాగబాబులో దాగి ఉన్నాడని వెల్లడించారు. నాగబాబు దేనినైనా కళ్లకు కట్టినట్టు చూపించే సత్తా ఉంది అని చెప్పారు పవన్.. ఎవరికైనా ఏదైనా ఎక్స్ ప్లైన్ చేయడంలో నాగబాబు మించిన వారు లేరు అని చెప్పారు పవన్ కల్యాణ్