మూడు రాజధానుల ఏర్పాటుపై జనసేన పార్టీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే జనసేన పార్టీ నేత నాగబాబు అలాగే మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ లు కలిసి అమరావతి రాజధాని రైతుల నిరసనకు మద్దతుగా నిలిచారు కూడా… అయితే తాజాగా నాగబాబు రాజధాని విషయంలో కొత్త స్వరం వినిపించారు…
సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వ్యాఖ్యలు తెలిపారు… గతంలో టీడీపీ నాయకులు రాజధానికి 34 వేల ఎకరాల సేకరణలో అవకతవకలు జరిగాయని వైసీపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది… అయితే నిజంగా అవకతవకలు జరిగిఉంటే విచారణ జరపాలని డిమాండ్ చేశారు…. అక్రమాలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు…
ఇక పవన్ కూడా ఇటీవలే రాజధాని విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది…క్యాబినెట్ మీటింగ్ తర్వాత తాము రాజధానిపై స్పందిస్తామని అన్నారు… పైగా మూడు రాజధానులపై ప్రకటనపై అమరాతిలో తప్ప మిగిలిన ఏ ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తం అవ్వకుంది… అందుకే నాగబాబు స్వరం మార్చారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు