నగరిలో టీడీపీ దొంగల చేతిలో….. ఇలా అయితే ఎలా చంద్రన్నా

నగరిలో టీడీపీ దొంగల చేతిలో..... ఇలా అయితే ఎలా చంద్రన్నా

0
85

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ బిజీలో ఉన్నారు… పార్టీ నేతలతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు… అందులో భాగంగా తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మూడు రోజులు పర్యటించారు…

ఈ పర్యటనలో కార్యకర్తలు చంద్రబాబు దగ్గర కన్నీరు పెట్టుకున్నారు. నగరి నియోజకవర్గానికి చెందిన రామానుజం చలపతి అనే కార్యకర్త కన్నీరు పెట్టుకున్నారు… 22 ఏళ్లుగా తెలుగుదేశం వీరాభిమానిగా మీరు ఎప్పుడు వచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోతున్నాని తెలిపారు…

తనకు ప్రభుత్వం ఉద్యోగం పోయింది… కేసులు పెట్టారు జైలుకు కూడా వెళ్లానని తెలిపారు… ప్రస్తుతం నగరిలో కార్యకర్తలను పట్టించుకునే నాయకుడే లేని అన్నారు… నగరిలో టీడీపీ దొంగల చేతిలో పెట్టారు.. పార్టీ గతి తప్పింది… ఇలా అయితే ఎలా చంద్రన్నా అని కన్నారు పెట్టారు రామానుజం