నాగార్జునసాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత

0
77

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్ఎస్ పి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో క్రస్ట్ గేట్లు తెరిచినట్టు వారు చెప్పారు. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 312 టిఎంసిలు. ప్రస్తుత నీటి నిల్వ 226 టిఎంసిలుగా ఉందని అధికారులు వెల్లడించారు.