2024లో నాగబాబు ఎక్కడినుండి పోటీ చేస్తున్నాడంటే…?

2024లో నాగబాబు ఎక్కడినుండి పోటీ చేస్తున్నాడంటే...?

0
86

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించింది. తెలుగు దేశం పార్టీ కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది. జనసేన పార్టీ మాత్రం కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడు.25 ఎంపీ సీట్లలో వైసీపీ 22 సీట్లు , టీడీపీ మూడు సీట్లు గెలుచుకోగా జనసేన మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదు. జనసేన పార్టీ తరపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఓడిపోయాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 2024 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగానే పోటీ చేయాలని నాగబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

తాజాగా భీమవరం పర్యటనలో పాల్గొన్న నాగబాబు ఇకనుండి నెలరోజుల్లో వారం రోజులు నర్సాపురంలోనే ఉండాలని నిర్ణయించుకున్నానని, నర్సాపురంలో ప్రజలకు ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్ళి సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నాగబాబు 2024 ఎన్నికల్లో ఎలాగైనా ఖచ్చితంగా గెలవాలని ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

జనసేన పార్టీ అభిమానులకు కూడా నాగబాబు ఓటమి నుండి తేరుకోవాలని ప్రజలకు చేరువ కావాలని సూచించాడు. ఇప్పటినుండే జనసేన పార్టీ అభివృధ్ధి కోసం అభిమానులు కష్టపడితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందని నాగబాబు వ్యాఖ్యానించాడు. మరి నాగబాబు చెప్పినట్లు జనసేన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు 2024 ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా ఇప్పటినుండే ప్రయత్నాలు ప్రారంభిస్తే మాత్రం 2024 ఎన్నికల్లో జనసేన మంచి ఫలితాలే సాధించే అవకాశం ఉంది.