నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి….
ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఏపీ ఇంచార్జ్ ఉమేష్ చాంది సోనియాకు ఒక నివేదికను అందించారు… ప్రస్తుతం చీఫ్ పదవికోసం మాజీ మంత్రి శైలజానాథ్ చింతా మోహన్, పళ్లంరాజులు పోటీ పడుతున్నారు… అయితే సుదీర్ఘ చర్చల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ గా నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది…
కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కిరణ్ కమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రిగా ఉన్నారు… విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జై సమఖ్యంధ్ర పార్టీని స్థాపించారు… 2014 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఆ తర్వాత నుంచి రాజకీయాలకు ఆయన దురంగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి… 2019 ఎన్నికల సమయంలో తిరిగి ఆయన కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు…