చాలా మంది షాపింగ్ చేసే సమయంలో ఆఫర్లు చూస్తూ ఉంటారు, ఆఫర్ ఉన్న వస్తువులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, అందుకే కస్టమర్లని ఆకర్షించేందుకు పలు ఆఫర్లు ప్రకటిస్తాయి కంపెనీలు.ఒక విచిత్రమైన సంఘటన స్విట్జర్లాండ్ లో ఆఫర్లతో జరిగింది.
ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థ తల్లిదండ్రులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అది ఏమిటో తెలుసా ..మా కంపెనీ పేరు కనుక మీ పాపకి పెడితే మీకు ఇంటర్ నెట్ ఫ్రీ అని చెప్పింది..ఏడాది కాదు ఏకంగా వారికి 18ఏళ్లు ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.
ఓ జంట ఈ ఆఫర్ తీసుకుంది…Twifi ఇంటర్నెట్ ప్రొవైడర్ కంపెనీ పేరును ఆ జంట తమ బిడ్డకి పేరుగా పెట్టుకున్నారు. ఇక వెంటనే ఓ బాండ్ అగ్రిమెంట్ ద్వారా వారు ఏకంగా 18 ఏళ్లు ఆ జంటకి ఇంటర్ నెట్ ఫ్రీగా ఇస్తాము అని తెలిపారు… స్విస్ జంట తమ కుమార్తెకు Twifia అనే పేరు పెట్టింది. ఇక ఆ జంట ఇంటర్ నెట్ కు ఎంత ఖర్చు చేస్తామో ఆనగదుని తమ కుమార్తె పేరిట సేవింగ్స్ చేస్తాము అని తెలిపారు.