ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రికొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు… మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని చంద్రబాబు మండిపడ్డారు … ఇక దీనిపై నాని స్పందిస్తూ చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు…
- Advertisement -
తమ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన కచ్చితంగా పెన్షన్ ఇస్తోందని అన్నారు… చంద్రబాబు తన జీవితంలో ఎన్నోసార్లు పారిపోయారని అన్నారు… 1983లో ఓడిపోగానే కాంగ్రెస్ ను వదిలి పారిపోయారని అన్నారు…
అప్పుడు చంద్రగిరి నుంచి కుప్పంకు పారిపోయారని అన్నారు… ఓటుకు నోటు కేసు బయటకు రాగానే హైదరాబాద్ ను వదిలి పారిపోయారని మండిపడ్డారు… చంద్రబాబు నాయుడు ఒక ఫేక్ ప్రతిపక్ష నేత అని మండిపడ్డారు నాని…