కేంద్ర మంత్రి పదవికి నఖ్వీ రాజీనామా..ఉపరాష్ట్రపతి బరిలో?

0
95

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ సమర్పించారు. నఖ్వీ పేరును ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. రాజ్యసభ సభ్యునిగా నఖ్వీ పదవీకాలం ముగింపుతో భాజపాలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేనట్టయింది.