Nara Lokesh | జగన్‌కు చిప్పు దొబ్బింది.. నారా లోకేష్ తీవ్ర విమర్శలు..

-

సీఎం జగన్‌పై టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాజువాకలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ సిద్ధం సభలో జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. జగన్‌కు చిప్ దొబ్బిందని.. మండుటెండలో నిర్వహించిన సిద్ధం సభలో కార్యకర్తలను మొబైల్ ఫోన్ టార్చ్ ఆన్ చేయమంటూ చెప్పారని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పిన మాటలతో కార్యకర్తలు ఒకరు మొహం ఒకరు చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జగన్‌కు ఏమైనా రేచీకటి ఉందా..? అని ప్రశ్నించారు.

- Advertisement -

అలాగే సైకిల్, గ్లాస్ విలువ పెత్తందారుడికి అర్థం కాదని.. సైకిల్ సామాన్యుడి చైతన్య రథమని, గ్లాసులో సామాన్యుడు టీ తాగుతారన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఇక రైతులు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేందుకు ఫ్యాన్ ఉపయోగపడిందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో 35 వేల మంది ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారని, అందుకే ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్త బుట్టలో పడేయాలని ప్రజలకు లోకేష్ పిలుపునిచ్చారు.

ఈ జగన్ అండ్ కో ఉత్తరాంధ్రకు కనీసం ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. కోడిగుడ్డు మంత్రి వల్ల ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమది అని పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు.

విశాఖలో రుషికొండకు గుండు కొట్టారని ఒక్క వ్యక్తి నివసించే భవనం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయడం అవసరమా? అని లోకేష్(Nara Lokesh) నిలదీశారు. తాము అధికారంలోకి రాగానే రుషికొండ ప్యాలెస్‌ను ప్రజల అవసరాల కోసం వినియోగిస్తామని వెల్లడించారు.

Read Also: కొడాలి నానికి CM జగన్ చెక్.. గుడివాడలో కొత్త అభ్యర్థి పేరిట ఫ్లెక్సీలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...