ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు… జగన్ మోహన్ రెడ్డి సొంత పనుల్లో బిజీ అయ్యారని అన్నారు…
కొద్దికాలంగా రాష్ట్రమంతటా వరదలతో అతలా కుతలం అవుతుంటే వాటిపై చర్యలు తీసుకోకుండా తన సొంత అవసరాల కోసం విదేశాలకు జగన్ వెళ్లారని లోకేష్ మండిపడ్డారు. దేశమంతటా వరదలు వస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించి ప్రజలను ఆదుకున్నారని తెలిపారు…
కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి తన అవసరాలకు విదేశాలకు వెళ్లారని ఆరోపించారు… నోటి పారుదల మంత్రి నోరు తెరిస్తే అబద్దాలు. మొన్న తప్పుడు లెక్కలతో తడబడ్డారు. ఇప్పుడు విషయంపై అవగాహన లేక, నోటికొచ్చిన అబద్దాలు చెప్పి ప్రజల ముందు బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు లోకేష్.