నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సినిమాల్లోకి రాలేదు, రాజకీయ వ్యవహారాల్లో కూడా తలదూర్చలేదు, ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కొన్ని విషయాలలో మాత్రం కీలకంగా ఉంటున్నారు. హెరిటేజ్ కంపెనీ వ్యవహారాలతో పాటు ఇటు లోకేష్ పై ఎలాంటి విమర్శలు వచ్చినా వాటి గురించి తెలుసుకుంటున్నారట. ఇటీవల చాలా వరకూ నారా లోకేష్ పై వైసీపీ ప్రభుత్వం తీవ్రస్ధాయిలో విమర్శలు చేస్తోంది.. ఈ సమయంలో వాటిని నారాలోకేష్ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున తిప్పికొడుతున్నారు.
అంతేకాదు వర్మ కూడా అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా తీశారు.. అందులో లోకేష్ పాత్రగా అందరూ భావిస్తున్న అంశం పై నారా బ్రాహ్మణి సీరియస్ అయ్యారు అని తెలుస్తోంది. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పర్వాలేదు, కాని పర్సనల్ గా కూడా కొందరు కావాలని ఆయనని టార్గెట్ చేస్తున్నారు అని బాధపడుతున్నారట.. అందుకే ఈ సినిమాపై అభ్యంతరాలు ఉంటే కచ్చితంగా కోర్టుకు వెళతాము అని పార్టీ నేతలకు చెప్పారు అని తెలుస్తోంది.
దీని కోసం ఎంత దూరం అయినా వెళతాం అని ఆమె భావించారట.. మొత్తానికి కొందరు కావాలనే లోకేష్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని. అలాంటి వారిని వదిలిపెట్టకూడదు అని టీడీపీ నేతలు అంటున్నారు.. తాజాగా వర్మ సినిమాపై కూడా ఆమె కోర్టుకు వెళతారు అని కొందరు అంటున్నారు.. చూడాలి మరి ఏ నిర్ణయం తీసుకుంటారో ..ఇప్పటికే అనేక కేసులు వివాదాల మధ్య ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.